సంక్రాంతి వినోదానికి కేరాఫ్ అడ్రెస్. అభిమానుల్లో అన్ లిమిటెడ్ ఆనందాన్ని లోడ్ చేయడానికి హీరోలు ఆ పండగరోజునే తమ సినిమాలతో మరో పండగను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. కొందరు హీరోలు కొన్నేళ్ళుగా తమ అభిమానుల్ని సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంటారు.ఇదిలా ఉండగా..నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే 41 ఏళ్ల ఎన్టీఆర్ దేవర సినిమాతో కలిపి ఇప్పటి వరకు దాదాపుగా 30 సినిమాలు చేశాడు.ఈ 30 సినిమాల్లో సంక్రాంతికి వచ్చిన మూవీస్ కేవలం 5 మాత్రమే. వీటిలో సక్సెస్ అయినవి 2. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో మొత్తం 5 సార్లు సంక్రాంతి వార్ లో బరిలోకి దిగాడు. జూనియర్ ఎన్టీఆర్ 2002లో మొట్టమొదటి సంక్రాంతి సినిమాగా నాగ రిలీజైంది. డికే సురేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక 2004 లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సైతం డిజాస్టరైంది. అలాగే 2005 సంక్రాతి కానుకగా జనవరి 14న రిలీజైన ‘నా అల్లుడు’ మూవీ కూడా డిజాస్టర్ అయింది. 2010 సంక్రాంతి కానుకగా జవనరి 13న రిలీజైన ‘అదుర్స్’ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలోని యన్టీఆర్ ద్విపాత్రాభినయం హైలైట్స్ గా నిలిచాయి. ఎస్పెషల్లీ బ్రహ్మానందం, తారక్ కాంబో సీన్స్ సినిమాకి అడ్వాంటేజ్ గా మారాయి. 2016 జనవరి 16న సంక్రాంతి కానుకగా రిలీజైన నాన్నకు ప్రేమతో మూవీ సూపర్ హిట్టైంది. అయితే ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు సంక్రాంతి బరిలో నిలిచాడు తారక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్.2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతోంది. దీంతో ఎన్టీఆర్ సంక్రాంతి సెంటిమెంట్ పై కొత్త చర్చ మొదలైంది.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.