క్లీంకార కేర్ టేకర్ వేతనం అన్ని రూ.లక్షలా.. ఓ రేంజ్ లో తీసుకుంటున్నారుగా!

Reddy P Rajasekhar
చరణ్ ఉపాసనల కూతురు క్లీంకారకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఆ న్యూస్ నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఊహ తెలియని వయస్సులోనే క్లీంకార సెలబ్రిటీ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. క్లీంకారకు ప్రస్తుతం లలిత డిసిల్వా కేర్ టేకర్ గా ఉన్నారు. లలితా డిసిల్వా నెల వేతనం ఏకంగా 2 లక్షల రూపాయలు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. క్లీంకార కేర్ టేకర్ వేతనం అన్ని లక్షలా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
చాలామంది సెలబ్రిటీల పిల్లలకు లలితా డిసిల్వా నానీగా పని చేశారు. అనంత్ పెళ్లిలో అనంత్ ను ఆత్మీయంగా హత్తుకుని ఈమె వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో లలితా డిసిల్వా కరీనా పిల్లలకు సైతం నానీగా పని చేశారు. లలితా డిసిల్వా మాట్లాడుతూ నాకు పిల్లలతో సమయం గడపడం చాలా ఇష్టమని అదే నా అభిరుచి, జీవితం అని వెల్లడించారు. ఆ రీజన్ వల్లే నర్సింగ్ చదివి చిన్నపిల్లల నర్స్ గా పని చేశానని ఆమె పేర్కొన్నారు.
 
మాది కేరళ అని నాన్న గవర్నమెంట్ జాబ్ చేసేవారని లలితా డిసిల్వా వెల్లడించారు. అమ్మ దుస్తుల తయారీ మిల్లులో పని చేసేవారని నేను ముంబైలో పుట్టి పెరిగానని ఆమె పేర్కొన్నారు. నా భర్త ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తారని కొడుకు బిజినెస్ చేస్తారని లలిత అన్నారు. 1996లో అనంత్ అంబానీకి నానీగా చేరానని వాళ్లు నన్ను సిస్టర్ లత అని పిలిచేవారని ఆమె అన్నారు.
 
అనంత్ చాలా క్రమశిక్షణతో ఉండేవాడని లలిత అన్నారు. కరీనా కపూర్ పిల్లల కోసం పని చేసిన సమయంలో సెలబ్రిటీ నానీగా నాకు పేరు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో క్లీంకారకు కేర్ టేకర్ గా మారానని లలిత వెల్లడించారు. ఉపాసన చరణ్ పాపకు అందుబాటులో ఉంటారని వాళ్లు నాతో ప్రేమగా ఉంటారని లలిత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: