మురారి: థియేటర్లలో వివాహాలపై కృష్ణవంశీ సీరియస్‌ ?

frame మురారి: థియేటర్లలో వివాహాలపై కృష్ణవంశీ సీరియస్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఘట్టమనేని కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. దాదాపు 50 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కూడా యంగ్ హీరో లాగానే కనిపిస్తాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ప్రిన్స్ మహేష్ బాబు... ఇప్పుడు కాస్త రిలాక్స్ మూడు లో ఉన్నాడు.
అతి త్వరలోనే జక్కన్నతో సినిమా కూడా ప్రారంభించబోతున్నాడు మహేష్ బాబు. ఈ ప్రాజెక్టు మొదలైతే దాదాపు రెండు సంవత్సరాల పాటు...  ఎస్ఎస్ రాజమౌళితో పంచయనున్నాడు మహేష్ బాబు. అయితే.. తాజాగా ఫ్రెండ్స్ మహేష్ బాబు బర్త్డే అయిన సంగతి తెలిసిందే. ఈ బర్త్ డే సందర్భంగా... ప్రిన్స్ మహేష్ బాబుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మురారి సినిమా బృందం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా... మురారి సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మురారి సినిమాను... చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ చూశారు. అయితే మురారి సినిమా.. నడుస్తున్న థియేటర్లలో... కొంతమంది యువతి యువకులు పెళ్లి కూడా చేసుకున్నారు.  చందమామ చందమామ అనే పాట వచ్చిన సమయంలో ఈ సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగాయి. అయితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శకుడు కృష్ణవంశీకి ట్యాగ్ చేశారు.

అయితే ఈ పెళ్లిళ్ల వీడియోలపై దర్శకుడు కృష్ణవంశీ చాలా సీరియస్ అయ్యారు.  థియేటర్లలో పెళ్లి చేసుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు కృష్ణవంశీ.  సాంస్కృతి, సంప్రదాయాలు  పట్టించుకోకుండా థియేటర్లలో పెళ్లి చేసుకోవడం... చాలా దారుణమని ఆయన తెలిపారు. అలాంటి పనులు ఎవరు కూడా చేయకూడదని కోరారు. ఇక థియేటర్లలో రీ రిలీజ్ అయిన మురారి సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కృష్ణవంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: