కొరటాలను టెన్షన్ పెడుతున్న రాజమౌళి.. ఇప్పటికే ఒక దెబ్బ పడింది..?

frame కొరటాలను టెన్షన్ పెడుతున్న రాజమౌళి.. ఇప్పటికే ఒక దెబ్బ పడింది..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాలేదు. కనీసం ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా యవరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. కనీసంలో కనీసం ఈయన దర్శకత్వం వహించిన సినిమా హిట్ లేదా బ్లాక్ బస్టర్ , ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. దానితో ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో నటించిన ఏ హీరోకైనా అద్భుతమైన క్రేజ్ లభించింది.

కాకపోతే ఈయన దర్శకత్వం వహించిన సినిమా తర్వాత ఏ హీరోకు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలే వచ్చాయి. కానీ ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేసిన తర్వాత ఏ హీరోకి కూడా విజయం దక్కలేదు. ఇకపోతే ఇప్పుడు ఈ విషయమే కొరటాల శివ కు పెద్ద ప్రమాదంగా మారినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ఎస్ ఎస్ రాజమౌళి ఆఖరుగా ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.  

రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇక ఈయన కూడా ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలో నటించడంతో ఈ మూవీ అయినా హిట్ అవుతుందా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ సినిమా కనుక హిట్ సాదిస్తే కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే రాజమౌళి సినిమాల తర్వాత హీరోకి హిట్  ఇచ్చిన దర్శకుడు అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: