హ్యాపీ డేస్ " టైసన్ " గుర్తున్నాడా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాడో..?

frame హ్యాపీ డేస్ " టైసన్ " గుర్తున్నాడా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాడో..?

lakhmi saranya
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల తర్కెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ డైనర్ హ్యాపీ డేస్. 2007 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసి ఫిదా అయిపోయారు. ఇంజినీరింగ్ కాలేజి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే నటించారు. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, గాయత్రీ రావు, డైసర్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ పో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా ఇదే సినిమాలో ఒక్కపలుచగా కళ్ళజోడుతో కనిపిస్తూ సినిమా సీనియర్ అమ్మాయిని లవ్ చేసే డైసన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. ఫన్ తో పాటు ఎమోషనల్ మిక్స్ చేసిన ఈ పాత్రలో రాహుల్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా సోనియా దీప్తి (శ్రావ్) కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఆ తరువాత కూడా డైసన్ పేరుతో నే ఫేమస్ అయిపోయాడు రాహుల్. అయితే హ్యాపీ డేస్ మూవీ తరువాత రాహుల్ ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం, వెంకటాపురం తదితర సినిమాల్లో నటించాడు రాహుల్ డైసన్.

అయితే ఏ సినిమా కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో క్రమంగా అతనికి అవకాశాలు కూడా సన్నగిల్లిపోయాయి. 2017లో వెంకటాపురం అనే సినిమాలో నటించిన రాహుల్ ఈ మధ్యనే మళ్లీ వెండి ధరపై కనిపించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఇందులో అజిజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించిన ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమా కూడా హిట్గా నిలిచింది. ఈ సినిమాను ప్రేక్షకలో అందరూ కూడా చాలా ఆదరించారు. ఈ సినిమాను యూత్ ఎక్కువగా చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: