టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఏడాది పాటు ఇతను ఆరోగ్యం బాగాలేదు అన్న కారణంగా సినిమాలకి దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలతో బిజీ కావస్తోంది. ఇప్పటికే ఆమె కోసం చాలామంది దర్శక నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఇకపోతే గతంలో ఆమె ఒప్పుకున్న సినిమాలను ప్రస్తుతం పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది సమంత. ఇదిలవుండగా తాజాగా ఓ వార్తతో సమంత మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఫ్యామిలీమాన్ వెబ్‌సీరిస్ తరువాత ఆమె నటిస్తున్న మరో
వెబ్‌సీరిస్ సీటాడెల్ హానీ బన్నీ. ఇటీవల దీని టీజర్ కూడా విడుదలైంది. త్వరలో ఇది స్ట్రీమింగ్ కూడా కానుంది. సమంత ఈ వెబ్‌సీరిస్ కోసం 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేసిందట. ఇది హీరోయిన్స్ పారితోషికాల్లో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డ్. గతంలో కూడా సమంత తెలుగు సినిమాలకు అత్యధిక ఫీజునే అందుకుంది. అయితే ఏకంగా 10 కోట్ల పారితోషికం మాత్రం ఇంతవరకు ఏ హీరోయిన్ రెమ్యూనరేషన్‌గా తీసుకోలేదట. ఇప్పుడు ఈ టాపిక్ బాలీవుడ్‌లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో
వైరల్‌గా మారింది. రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం సమంతకు కొత్తేమి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ రోజుల్లోనే తన పారితోషికాన్ని రూ. కోటికి పెంచేసింది. స్టార్ హీరోయిన్లు అంతా రూ. కోటి తీసుకుంటున్న సమయంలో.. సామ్ 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే ఐటమ్ సాంగ్స్‌కి కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి సమంతనే. ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా తన మార్క్ చూపించబోతుంది. ఓ వెబ్ సిరీస్‌కి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్ సమంతనే అని చెప్పొచ్చు. అయితే పారితోషికం తగ్గట్టే నటన పరంగా కూడా సామ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది...!!