తన ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పిన కమలహాసన్..!?

frame తన ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పిన కమలహాసన్..!?

Anilkumar
విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భారతీయుడు 2' . లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందింది. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని జూలై 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.  శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలవుండగా

 కమల్ హాసన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల నుండి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన రియాలిటీ టీవీ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఒక లాంగ్ నోట్‌ షేర్ చేశాడు. “7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మా ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకుంటున్నానని బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మునుపటి సినిమా కమిట్‌మెంట్‌ల

 కారణంగా, నేను చేయలేకపోతున్నాను అని విశ్వనాయకుడు కమల్ హాసన్   ప్రకటించారు. అంతేకాదు ఈ షో ద్వారా మీ ఇళ్లలో మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. మీరు మీ ప్రేమ, ఆప్యాయతతో నన్ను ఆదరించారు. దానికి మీకు నా కృతజ్ఞతలు. బిగ్ బాస్ తమిళ్‌ను భారతదేశంలోని అత్యుత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మార్చడానికి మీ ఉత్సాహభరితమైన, భావోద్వేగ మద్దతుకు ఋణపడి ఉంటాను. ప్రదర్శనలో పాల్గొన్న పోటీదారులలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విజయ్ టీవీ అద్భుతమైన బృందానికి మరియు ఈ సంస్థను భారీ విజయాన్ని సాధించడంలో పాలుపంచుకున్న ప్రతి టీమ్ మెంబర్‌కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీజన్‌ మరో సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్  ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: