పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా యంగ్ హీరో.. లేటెస్ట్ పోస్టర్ వైరల్..!
ఈ రెండు చిత్రాలపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, విశ్వక్ సేన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గన్ పాకెట్ లో పెట్టుకుని నిలుచున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు మేకర్. శ్రీధర్ గంట దర్శకత్వంలో VS 13 వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్క పోతుంది. దీనిని SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా..మ్యూజిక్ డైరెక్టర్గా ఆంజనీష్ సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్సేన్ మొట్టమొదటిగా వెళ్ళిపోమాకే అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత హిట్, తెలుగోడి ఆత్మగౌరవం, ఆకాశవనంలో అర్జున కళ్యాణం, మను చిరిత్ర, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి వంటి సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గామి మూవీలో నటించిన తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ కొత్త మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం హిట్ కొట్టలేకపోయింది. మరి ఈ సినిమా అయినా కొడుతుందో లేదో చూడాలి.