టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపుతున్న ఆ బాలీవుడ్ బ్యూటీలు వీరే..?

frame టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపుతున్న ఆ బాలీవుడ్ బ్యూటీలు వీరే..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ చాలా చిన్నది. దానితో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నటిమనులు తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. ఇక తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు కూడా ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ హిట్ కొట్టి హిందీ సినీ పరిశ్రమలో క్రేజ్ సంపాదించుకుందామా అనుకునే వారు కూడా ఉండేవారు. కానీ ప్రస్తుతం ప్రవళి స్థితిలో మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరిగింది.

దానితో కొత్తగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలు తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న కొంత మంది నటీమణులు ప్రస్తుతం తెలుగు పై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఆలియా భట్ ఒకరు. ఈమె ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే కూడా ఇప్పటికే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన బ్యూటీలలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయింది. వీరితో పాటు మరి కొంత మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: