దేవర సాంగ్ పై ఫ్యాన్ కామెంట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..!!

frame దేవర సాంగ్ పై ఫ్యాన్ కామెంట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ “జాన్వికపూర్” ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.దేవర సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కనుక ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ నేడు రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి మేక‌ర్స్ వ‌రుసగా అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియా లో సంద‌డి చేస్తున్నారు. ఈ పాట ఓ రొమాంటిక్ మెలోడీగా రానుందని మేక‌ర్స్ ఇప్ప‌టికే రివీల్ చేశారు. ”చుట్ట‌మ‌ల్లె” అనే చ‌ర‌ణంతో సాగే ఈ పాట‌కు సంబంధించి తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ లు క్యూట్ అండ్ రొమాంటిక్ గా ఉండ‌టంతో అభిమానులు ఈ పాట కోసం మరింత ఆతృత‌గా చూస్తున్నారు.అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు. ఇక ఈ సాంగ్ ను నేడు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ పాట అభిమానుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఇలాంటి పాట వచ్చి చాలా కాలం అయిందని గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి సోషల్ మీడియాలో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు."ఇంత హైప్ ఇస్తున్నారు అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్" అని హెచ్చరించాడు. దానిపై శాస్త్రి స్పందించారు. "హైప్ కాదు నిజం" సాయంత్రం మళ్లీ చెప్పు ఇక్కడే ఉంటా అని అతడికి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ ట్రోల్స్ పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించి ఆయన సోషల్ మీడియా ద్వారా సదరు నెటిజన్ కు ఈ విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు".

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: