పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది. అయితే ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాగా ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్లు నటిస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది.కొద్ది రోజుల క్రితం ది రాజాసాబ్ చిత్రం నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.దీంతో గ్లింప్స్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. కచ్చితంగా ది రాజాసాబ్ సినిమా డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రొమాంటిక్ హర్రర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం మొదలైన షూటింగ్ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొంది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ లోనే మాళవిక మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. వీటికి సంబందించిన ఫోటోలని అఫీషియల్ గా సోషల్ మీడియాలో పంచుకున్నారు. మాళవిక మోహనన్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిందని, ఆమెకి గ్రాండ్ గా స్వాగతం చెబుతున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పేర్కొంది.అలాగే మాళవిక మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా షూటింగ్ సెట్ లో చేసినట్లు తెలిపింది. ఈ రోజు ఇది క్యూటెస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఇంటర్ నెట్ అని పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మారుతి మాళవిక మోహనన్ కి కేక్ తినిపించి విషెస్ చేశారు. మాళవిక మారుతితో సెల్ఫీ తీసుకుంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్, మాళవిక మోహనన్ మధ్య మంచి రొమాంటిక్ సీక్వెన్స్ లు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది.డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.