RC17: చరణ్ సుకుమార్ కాంబోలో మూవీ.. మరో రంగస్థలం అవుతుందా..!?

frame RC17: చరణ్ సుకుమార్ కాంబోలో మూవీ.. మరో రంగస్థలం అవుతుందా..!?

Anilkumar
పుష్ప సినిమాతో తన స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిపోయాడు సుకుమార్. ఈ సినిమాతో బన్నీకి జాతీయ అవార్డును సైతం తెచ్చింది సుకుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఈ  ఏడాది చివరిలో పుష్పటును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే  దీనికి సంబంధించిన షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా సుకుమార్ చరణ్ తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు

 వినబడుతున్నాయి. ఇప్పటికే చరణ్ తో సుకుమార్ సినిమా కన్ఫామ్ సైతం అయ్యింది. రాంచరణ్ కెరియర్ లో 17వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని సైతం మెగా ఫ్యామిలీ అందించింది. ఇప్పటికే గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చరణ్‌ తో చేయబోతున్న సినిమా కోసం సుకుమార్‌ స్టోరీ లాక్ చేశాడట. చరణ్‌ కూడా సుకుమార్‌ చెప్పిన స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మెగా కాంపౌండ్‌

 నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చరణ్ ను మరోసారి చిట్టిబాబు తరహా పాత్ర లో సుకుమార్‌ చూపించబోతున్నాడట.  రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పల్లెటూరి మాస్ కుర్రాడి పాత్రలో కనిపించాడు. ఆ తరహాలోనే చరణ్ ను చూపించాలని సుకుమార్‌ భావించి కథ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. మొదట రంగస్థలం సీక్వెల్‌ అనే ప్రచారం జరిగింది. కానీ రంగస్థలం సినిమాకి ఆర్‌సీ17 కి సంబంధం లేదని సుకుమార్‌ సన్నిహితుల ద్వారా క్లారిటీ వచ్చింది.  రంగస్థలం కథ తో సంబంధం లేకుండా, ఆ సినిమా తరహాలో చరణ్‌ ను మాస్ లుక్ లో, పల్లెటూరి కుర్రాడిగా చరణ్‌ ను చూపించి మరో భారీ విజయాన్ని సుకుమార్‌ అందుకోవడం ఖాయంగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: