హాట్ అథ్లెట్ గా సోషల్ మీడియాని ఊపేస్తోన్న ప్రియాంక చోప్రా?

Purushottham Vinay

 ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఒలింపిక్స్ లోనే మునిగిపోయిన సంగతి తెలిసిందే. గెలిచిన వాళ్లను...గత రెండు సంవత్సరాల విజేతల్ని కూడా సోషల్ మీడియా గుర్తు చేస్తూ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తుంది.అయితే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నేను సైతం అంటూ అథ్లెట్ లా రెడి అయిన ఓ సెల్పీని ఇన్ స్టాలో పోస్ట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. స్కిన్ టైట్ స్పోర్స్ట్ దుస్తుల్లో అచ్చంగా అథ్లెట్ నే మరిపించి మెప్పిస్తుంది. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో ఈ హాట్ బ్యూటీ నడుము అందాలు చూపిస్తూ స్కిన్ షో చేసింది. కాళ్లకు షూస్..మోకాలికి, మోచేతులకి సేప్టే బ్యాండ్స్ ధరించి అద్దం ముందు సెల్పీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది.మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంక చొప్రా కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్ అన్న సంగతి తెలిసిందే. తన కంటే 10 సంవత్సరాలు చిన్న వాడైనా అమెరికా సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లాడింది. 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా కుర్ర దానిలా చాలా హాట్ గా కనిపిస్తుంది. అందుకు కారణం వర్కౌట్లు క్రమం తప్పకుండా చేస్తుంది. 

ఎల్లప్పుడూ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుటుంది. హాలీవుడ్కి వెళ్లిన తర్వాత అయితే మరింత శ్రద్ద వహిస్తుంది. ఇక ఈ హాట్ బ్యూటీ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో బాక్సర్ మేరికోమ్ బయోపిక్ లో గతంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక చొప్రాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.మేరికోమ్ పాత్రలో ఈ హాట్ బ్యూటీ ఒదిగిన విధానం విమర్శకుల ప్రశంసలు కురిపించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచిగానే వసూళ్లను సాధించింది. ఇక ఆ విజయం స్పూర్తితో మరింత మంది అథ్లెట్ కథల్ని బాలీవుడ్ దర్శకులు తెరకెక్కించే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ప్రియాంక చొప్రా. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచాకా ఈ బ్యూటీకి ఆఫర్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. దాంతో చాలా కాలం పాటు బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా వెలిగింది. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ తరువాత ఆఫర్లు తగ్గాకా హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ టీవీ సీరియల్స్ లో నటించింది. ఇక అక్కడే నిక్ ని పెళ్లాడి సెటిల్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: