కల్కి సినిమాతో నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

Divya
రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ దిశా పటాని , దీపికా పదుకొనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ సినిమాలో కమలహాసన్ అమితాబచ్చన్ తో పాటు తదితర సెలబ్రిటీలు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేస్తూ ఉంది కల్కి సినిమా. ప్రస్తుతం కల్కి సినిమా జోష్ కలెక్షన్స్ పరంగా బాగానే దూసుకుపోతోంది.

దాదాపుగా నాలుగు వారాల పాటు హిట్ టాక్ తో కల్కి సినిమా దూసుకుపోయింది. ఇప్పుడు ఐదవ వారంలోకి కూడా అడుగుపెట్టింది.. ఇప్పటి కూడ బుక్ మై షో లో 19k టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే కల్కి సినిమా ఏ రేంజ్ లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 15 వరకు సినిమా లాంగ్ రన్ ఉండబోతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ లోపు కొన్ని సినిమాలు విడుదలైన అవన్నీ కూడా మీడియం రేంజ్ సినిమాలకు రావడం చేత పెద్దగా ఇబ్బందులు లేదు.. అయితే దాదాపుగా 700 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఈ సినిమా 372 కోట్లకు పైగా థియేటర్లు బిజినెస్ జరిగింది.

ఈ సినిమా ప్రస్తుతం 1150 కోట్ల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది .దాదాపుగా అన్ని ఏరియాలలో కూడా కల్కి చిత్రం బ్రేక్ ఈవెంట్ సాధించిందని తెలుస్తోంది ఈ సినిమా ఏకంగా నిర్మాతలకు 160 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమా గా బాహుబలి-2 సినిమా ఉండగా.. ఇప్పుడు ఆ సినిమాని మించి కలెక్షన్స్ రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ సరికొత్త రికార్డు కూడా కల్కి సినిమా రాసిందనే విధంగా  వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: