ది రాజాసాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Purushottham Vinay

కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. చిన్న డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మలయాళం హాట్ బ్యూటీగా దూసుకుపోతున్న మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రభాస్ పోస్టర్ అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంది. తాజాగా 'ది రాజా సాబ్' మూవీ నుండి ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న స్పెషల్ గిఫ్ట్ రానే వచ్చింది. ' ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్' పేరుతో ఓ వీడియోను వీడియోని చేసింది మూవీ టీం. ఇక ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌కి ఎంతగానో ఫుల్ కిక్కిచ్చారు. ఈ గ్లింప్స్ కేవలం 45 సెకన్ల పాటే ఉన్నప్పటికీ వీడియోలో మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఫ్లవర్ బొకే పట్టుకొని బైక్‌పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ స్టైల్ ను చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ఇంకా దీంతో పాటు మరో సర్ ప్రైజ్ ను కూడా ఇచ్చారు మేకర్స్. 


ది రాజా సాబ్ 2025 ఏప్రిల్ 10న తేదీన కాబోతుందని గ్లింప్స్‌‍లో అధికారికంగా ప్రకటించారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు ది రాజా సాబ్ మేకర్స్. 'మాసు.. క్లాసు.. స్వాగు.. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంటు'అని ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్.ఇక ఇదిలా ఉంటే చాన్నాళ్ల నుంచి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ప్రభాస్ ఎక్కువగా నటిస్తున్నారు. అయితే ది రాజా సాబ్ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని గ్లింప్స్ చూస్తే ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది. హార్రర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌లో మారుతి తన దైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇంకా అలాగే యోగి బాబు కూడా ఈ లో సందడి చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచి బొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: