గ్లోబల్ బాక్సాఫీసుని రఫ్ఫాడిస్తున్న డెడ్ పూల్ అండ్ వాల్వరిన్?

Purushottham Vinay

హాలీవుడ్ సూపర్ హీరో యాక్షన్ మూవీ 'డెడ్ పూల్ అండ్ వాల్వరిన్' మూవీ ఇపుడు గ్లోబ్లల్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరిస్తోంది.ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ డంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ లెవల్లో దాదాపు రూ. 3670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా సాలిడ్ గా వసూళ్ళని రాబడుతూ రన్ అవుతూనే ఉంది.ఇంకా ఈ సినిమా తెలుగు నాట కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది.భారీ అంచనాల మధ్య జూలై 26న విడుదలైన ఈ మూవీని మార్వెల్ స్టూడియోస్ వారు భారీ ఎత్తున నిర్మించారు. రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు.


దాదాపు మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 3670 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక భారత దేశంలో కూడా డెడ్ పూల్ సినిమా హవా ఒక రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మార్వెల్ అభిమానులకు తగ్గట్టు ఈ సినిమా ఉండటం బాగా కలిసొచ్చింది.ఇంకా అంతేకాదు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఇపుడు యూత్ లో పాతుపోయిన టైమ్లీ డైలాగ్స్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. డెడ్ పూల్ క్యారెక్టర్ చేసిన నటుడు రయన్ రెనాల్డ్స్ పలికిన తెలుగు డైలాగులకు తెలుగు ఆడియన్స్ మంచి విపరీతంగా అప్లాజ్ వస్తోంది. ఇంకా అంతేకాదు యాక్షన్ సినిమాలో కామెడీని కూడా ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. తెలుగులో ఈ సినిమా మంచి ఆదరణతో ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీకి గట్టి పోటీ ఇస్తూ తెలుగు బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కల్కి 2898 ఏడి వసూళ్లు కాస్త తగ్గాయి. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎన్ని వేల కోట్లు నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: