ప్రమాదానికి గురైన ప్రేమలు మూవి నటుడు.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
ప్రేమలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నటువంటి నటులలో నటుడు సంగీత్ ప్రతాప్ కూడా ఒకరు.. తాజాగా అర్జుకన్ అశోకన్ ఉన్న కారు తాజాగా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలను కొచ్చిలో షూటింగ్ చేస్తూ ఉండగా నిన్నటి రోజున కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.. రెండు బైకులను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టినట్లుగా సమాచారం. దీంతో కారు చాలా ధ్వంసం అవ్వడంతో పాటు బైక్ పై ప్రయాణిస్తున్న నటులు సంగీత్ ప్రతాప్,అర్జుకన్ అశోకన్ గాయాలైనట్లుగా సమాచారం.

అయితే ఇదంతా కేవలం సినిమా షూటింగ్లో భాగంగా హై స్పీడ్ తో చేంజింగ్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఎంజీ రోడ్లలో ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రక్తపు మడుగులో ఉన్న ఈ యాక్టర్స్ ను బైక్ రైడర్ తో సహా మరో ముగ్గురిని ఆసుపత్రికి హుటాహుటిగా అక్కడ ఉన్న సిబ్బంది తరలించారు. ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మరి దర్యాప్తు చేయగా.. డైరెక్టర్ అర్జున్ బోస్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు వీరిద్దరూ నటిస్తున్నారట.

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ కావడంతో అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు యాక్టర్స్ ఆసుపత్రిలో చికిత్స సైతం పొందుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు మూడు రోజులలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేవిధంగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది. అభిమానులు కూడా వీరిని త్వరగా కోలుకోవాలని మళ్లీ తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనాలంటు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: