మీ హీరోకి ఆడవాళ్ళని బూతులు తిట్టడం తప్ప, ఇంకేం వచ్చు: అనసూయ
అలా ఆమె చేసిన పాత్రకి గాను... సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలోని అనసూయ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. వరుసగా సినిమాలలో నటిస్తూ తనదైన మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక అసలు విషయంలోకి వెళితే... రౌడీ బాయ్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి కూడా ఇక్కడ పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం యూత్ లో మనోడికి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలా ఇద్దరూ కష్టపడి పైకి వచ్చిన వారే. కానీ వీరిమధ్య వైరం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ.. అనసూయ పేరు వినపడగానే విజయ్ పేరు కూడా వినబడుతుంది. అదొక జాతి వైరం లాగా తయారయింది.
అనసూయ తాజాగా సింబ ఈవెంట్లో పాల్గొనగా ఆమెకే విచిత్రమైన అనుభవం ఎదురయింది. సదరు యాంకర్ విజయ్ కి, నీకు గొడవ సద్దుమణిగిందా? అనే ప్రశ్న అడగడంతో అనసూయ దానికి సమాధానాన్ని దాటవేసింది. ఈ క్రమంలోనే రౌడీ దేవరకొండ అభిమానులు ఆమెని ట్రోల్ చేయడం జరిగింది. ఇక ఆ మాటలకు అనసూయ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఏదైనా పనికి వచ్చే పని చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే అనసూయ మాత్రం ఎవరి పేరునీ మెన్షన్ చేయనప్పటికీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గురించే ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం ఇది మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.