"గేమ్ చేంజర్" లో నా పాత్ర అదే పృథ్విరాజ్.. శంకర్ ఈ నటుడ్ని అంతలా నమ్మాడా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర , పృథ్వీరాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయినట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. అలాగే మరో 10 , 15 రోజుల షూటింగ్ తో ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు కూడా మూవీ బృందం ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు దిల్ రాజు కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు.

ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న పృథ్వీరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా గేమ్ చేంజర్ సినిమాలో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా పృధ్వీరాజ్ మాట్లాడుతూ ... గేమ్ చేంజెస్ సినిమాలో నేను , ఎస్ జె సూర్య కు మామయ్య పాత్రలో కనిపించబోతున్నాను. ఇక ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అది మిమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటుంది , అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని పృథ్విరాజ్ తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: