తమన్నా ఇక ఐటమ్ బాంబ్ గా సెటిల్ అవ్వాలనుకుంటుందా?

Purushottham Vinay

మిల్కీ బ్యూటీ తమన్నా ఐటం సాంగ్స్ లో ఏరేంజ్ లో పెర్పార్మ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సౌత్ లో ఐటం భామగా ఓ ముద్ర వేసేసింది తమన్నా. ఎన్నో ఐటమ్ సాంగ్స్ చేసి తానో బ్రాండ్ అని ప్రూవ్ చేసింది.మిల్కి బ్యూటీ తమన్నా క్రేజ్ నటిగా కంటే ఐటం పాటలతోనే మరింత రెట్టింపు అయింది. టాలీవుడ్...కోలీవుడ్ లో తమన్నా తో ఐటం పాట అంటే? థియేటర్ కి క్యూ కట్టే జనాభా చాలా ఎక్కువ ఉంటుంది.బాలీవుడ్ భామల కంటే కూడా తమన్నా సౌత్ కి బాగా కనెక్ట్ అయింది. హీరోయిన్ గా చేసిన క్రేజ్ కూడా ఆమెకు కలిసొచ్చింది. ఇటీవలే తమిళంలో `అరణ్మనై 4`సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో అందంతో పాటు మంచి నటనను కనబరిచింది. కానీ ఈ సినిమా ముగింపులో ఆమె చేసిన హాట్ సాంగ్ ఎక్కువ కిక్ ఇచ్చింది. 


ఇక బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో తనకెలాంటి హద్దులేవని మరోసారి ప్రూవ్ చేసింది. అలాంటి హాట్ బ్యూటీ ఐటెం పాటల్లో ఇంకే రేంజ్లో చెలరేగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అనుకున్నట్లు గానే 'స్త్రీ-2' సినిమాలోని ఐటం పాటలో డబుల్ కిక్ ఇచ్చింది తమన్నా. ఇప్పటికే రిలీజ్ అయిన ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ హాట్ బ్యూటీ హాట్ పెర్పార్మన్స్ కి బాలీవుడ్ జనాలు అంతా ఫుల్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లో మరో హాట్ హిట్ నెంబర్ గా ఈ పాట నిలిచిపోతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. కొంత మంది తమన్నా పెర్పార్మెన్స్ కి అయితే ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే హాట్ ఐటం భామగా మిల్కీ బ్యూటీని పోల్చడం తమన్నా ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ గా మారింది. తమన్నా మంచి పెర్మార్ అని ఆ ఛాన్సులు వదిలేసి ఇలా ఐటం నెంబర్లు చేయడం ఏం బాలేదు అన్నవారు వారు కూడా కనిపిస్తున్నారు. మరి ఈ నెగివిటీని  తమన్నా తొలగించుకోగల్గుతుందా? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: