కల్కి రికార్డు బ్రేక్ చేసే ఆ స్టార్ హీరో ఎవరో..?
బాహుబలి సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో కూడా మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరాడు.అయితే తాజాగా కల్కి సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్స్ కూడా క్రాస్ చేసి టాప్ వన్ దిశగా దూసుకుపోతుంది.అయితే కల్కి సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.పుష్ప సినిమా తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.తాజాగా ఆయన నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా తో గ్లోబల్ వైడ్ పాపులర్ అవ్వాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ ,రాంచరణ్ ఈ సారి దేవర ,గేమ్ ఛేంజర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.దీనితో ఈ ముగ్గురి స్టార్స్ లో ఎవరి సినిమా రికార్డు కలెక్షన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .