బుక్ మై షోలో మరో సెన్సేషనల్ రికార్డ్ కొట్టిన కల్కి?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27 వ తేదీన థియేటర్స్ లో రిలీజయి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఈ సినిమా చాలా వేగంగా దూసుకుపోతుంది.ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ప్రభాస్ అభిమానులతో పాటు కల్కి మూవీ యూనిట్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సృష్టించింది ఇంకా నమోదు చేస్తుంది. ఈ సినిమాతో ఇప్పటిదాకా ప్రభాస్ కూడా బోల్డన్ని రికార్డులు సృష్టించాడు.మళ్ళీ కల్కి సినిమా మరో సరికొత్త సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ బుక్ మై షోలో రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి దాకా కూడా ఆల్మోస్ట్ మూడు వారాలు అవుతున్నా కూడా ప్రతి రోజూ అత్యధిక టికెట్స్ సేల్ అవుతున్నాయి. ఇప్పటి దాకా ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు, రిలీజయిన మూడు వారాల దాకా టికెట్లు అమ్ముడుపోలేదు.తాజాగా బుక్ మై షో.. కల్కి సినిమాకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి నిన్నటి దాకా కల్కి సినిమాకు తమ ప్లాట్ ఫారంలో అమ్ముడు పోయిన టికెట్ రేట్ల వివరాలను ప్రకటించింది. 


కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ జూన్ 23న ఓపెన్ చేయగా ఆ రోజు 328K అంటే ఆల్మోస్ట్ 3 లక్షల 28 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇక కల్కి సినిమా రిలీజ్ రోజు అంటే జూన్ 27న ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.సినిమా రిలీజ్ తర్వాత రోజు ఏకంగా 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి ఆన్లైన్ లో. ఇక ఈ సినిమా రిలీజయి మూడు వారాలు అయినా కూడా నిన్న జులై 17న 1 లక్ష 28వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.అయితే ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చూపించిన లెక్కలు. దేశవ్యాప్తంగా కేవలం బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి దాకా ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో కల్కి సినిమా ఏ సినిమా సృష్టించని సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటి దాకా ఒక సినిమాకు అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ సేల్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అని మూవీ యూనిట్ ప్రకటించింది. ఒక్క బుక్ మై షోలోనే ఇన్ని టికెట్స్ అంటే వివిధ టికెట్ యాప్స్, డైరెక్ట్ గా థియేటర్స్ వద్ద కలిపి ఇంకెన్ని టికెట్స్ అమ్ముడయ్యాయని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి బాహుబలి 2 లాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: