ఇలాగైతే 1000 కోట్లు కాదు కదా 500 కోట్లు కూడా కష్టమే పుష్పా?

Purushottham Vinay

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా తక్కువ వసూళ్లు నమోదు చేసినా మంచి పాన్ ఇండియా హిట్ కొట్టింది. సుక్కు పుష్ప రాజ్ పాత్రని ప్రతి ఒక్క ఆడియన్ కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అందుకే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ గా పుష్ప 2 వస్తుంది. ఈ సినిమాలో కూడా పుష్ప రాజ్ విశ్వరూపం తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని మేకర్స్ అంటున్నారు. ఐతే పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ కాస్త కంగారు గానే ఉన్నారు. ఎందుకు అంటే.. ఆగష్టు 15న ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి సడెన్ గా డిసెంబర్ 6 వ తేదీకి కి వాయిదా వేశారు. ఆగష్టు నెలలో పుష్ప రాజ్ మేనియా ఉండబోతుందని ఆశించిన ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది.ఐతే పుష్ప 2 సినిమా డిసెంబర్ కి వస్తుంది ఈలోగా సినిమాపై అంచనాలు పెంచేలా ఏమైనా ప్రమోషన్స్ చేస్తున్నారా అంటే అది కూడా చేయట్లేదు. పుష్ప 1 ఎలాగు హిట్ అయ్యింది భారీ ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా పుష్ప 2 మీద ఇంపాక్ట్ పడదని సుకుమార్ అనుకుంటున్నాడేమో. 


ఐతే ప్రమోషన్స్ ఏమో కానీ కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇవ్వడం కూడా పూర్తిగా మానేశారు. విడుదల అయిన రెండు సాంగ్స్ కూడా జస్ట్ యావరేజ్ గానే ఉన్నాయి.ఈ టైం లో పుష్ప అప్డేట్స్ లేదా ఏదైనా గ్లింప్స్ వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ఆ పని కూడా టీం చెయ్యడం లేదు. దీంతో ఇలాగైతే చాలా కష్టం 1000 కోట్లు కాదు కదా కనీసం 500 కోట్లు కూడా రావడం కష్టమే అంటున్నారు నెటిజన్స్. అయితే కల్కి సినిమా రిలీజ్ ముందు నాగ్ అశ్విన్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఆ సినిమాకు ఈ రేంజ్ లో 1000 కోట్ల కలెక్షన్స్ రావడానికి అది కూడా ఒక రీజన్ అంటున్నారు. సినిమా గురించి ఎక్కువ చెప్పి ఆడియన్స్ కి లేనిపోని అంచనాలు క్రియేట్ చేయడం కన్నా రిలీజ్ ముందు ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు. బ్లాక్ బస్టర్ బొమ్మ ఇస్తే చాలు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. కల్కి లానే సుకుమార్ కూడా సినిమా గురించి ఎక్కువ లీక్స్ లేకుండా చేయడానికే పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. డిసెంబర్ 6న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న పుష్ప 2 ఎలాంటి విజయం నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: