భారతీయుడు -2 మేకర్స్ షాకింగ్ డెసిషన్.. అన్ని నిమిషాలు కట్?

praveen
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఏ సినిమాను హీట్ చేస్తారు ఏ సినిమాకు డిజాస్టర్ గా మార్చేస్తారు అన్న విషయం అసలు అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 మరి ముఖ్యంగా వందల కోట్ల భారీ బడ్జెట్లో తెరపెక్కుతూ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాల జాబితాలో చేరిపోయింది లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు-2. ఈ సినిమాకు మొదటి పార్ట్ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సాధారణంగా శంకర్ సినిమా అంటేనే భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి. దానికి తోడు కమల్ హాసన్ తో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే.. ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమా ఎందుకో ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. దాదాపు అటు నిర్మాతలకు నష్టాలు వచ్చేసాయి అన్నది అర్థమయిపోయింది. ఇలాంటి సమయంలో ఇక ఎప్పుడూ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఈ సినిమా మూడు గంటలు నడివి ఉండడం పై ఎంతో మంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇక ఈ సినిమాను 20 నిమిషాల సన్నివేశాలు మేకర్స్ తొలగించారు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం 2:40 గంటల నిడివితో  చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా రెండు రోజులలో కేవలం 42 కోట్ల వస్తువులు మాత్రమే సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: