సోషల్ మీడియాలో దూసుకుపోతున్న నాని సరిపోదా శనివారం సెకండ్ సింగిల్..!

Anilkumar
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాచురల్ స్టార్ నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఎస్.జె.సూర్య విలన్ గా  నటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు వరుస అప్డేట్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్.

 అదేంటంటే ఈ సినిమా నుంచి మేకర్స్ సాంగ్  ని రిలీజ్ చేశారు. ఈ ఉల్లాసం
సాంగ్  లో నాని ప్రియాంక మోహన్ ఇద్దరి మధ్య మంచి సీన్స్ కనిపిస్తుండగా జెక్స్ బిజోయ్ మ్యూజిక్ మంచి బిట్స్ ని అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాని డి.వీ.వీ. ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఆగస్ట్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన మేకింగ్ వీడియోలో నాని మాస్ లుక్ కి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. 

రెండు సాలిడ్ హిట్ సినిమాల తర్వాత నాని సరిపోదా శనివారం సినిమాతో తెరమీదకి వస్తుండడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్, గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స సెకండ్ సింగిల్ 'ఉల్లాసం' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ నెంబర్ ఇన్స్టంట్ గా హిట్ అవుతోంది, విన్న వెంటనే ట్యూన్‌తో లవ్ లో పడతారు. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్ గా ఎక్స్ ప్రెస్ చేస్తోంది. సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన ఎక్స్ ప్రెస్సీవ్ వాయిస్ తో మ్యాజిక్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: