కన్నప్ప నుంచి శరత్ కుమార్ మాస్ లుక్ రివీల్..!!

murali krishna
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ " కన్నప్ప".ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ బ్యానర్,అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ బాబు,శరత్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్  అందిస్తున్నారు.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీనితో మంచు విష్ణు ఈ సినిమా విఎఫ్ఏక్స్  వర్క్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రసిహుతం శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే మేకర్స్ ఈ  సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.నేడు శరత్ కుమార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా భారీ సెట్ లు వేసి షూటింగ్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం  ఎంతో మంది టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.దీనితో ఈ సినిమా కచ్చితంగా భారీ విజయం సాదిస్తుందని విష్ణు ధీమాగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: