విజయశాంతి బాటలోనే.. కల్కి మూవీ నటి..!

Divya
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ విజయశాంతి కూడా ఒకరు.. ఇమే గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది హీరోలకు జోడిగా కూడా నటించింది ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్న తనకు ఇష్టమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రాధాన్యత కలిగిన పాత్రలోనే చేస్తూ ముందుకు వెళ్తోంది. సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు చిత్రంలో నటించిన విజయశాంతి. మళ్లీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటించిన ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది.

తాజాగా కల్కి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో నటించిన సీనియర్ హీరోయిన్ నటి శోభన ప్రతి ఒక్కరికి సుపరిచితమే స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ తన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలోనే నటించింది. చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె క్లాసికల్ డాన్సులు తన కెరియర్ ని కొనసాగిస్తూ ఉన్నది. మాతృభాష అయిన మలయాళం లో కూడా ఈమె పెద్దగా సినిమాలలో నటించడం లేదు. మొదట కల్కి సినిమా కోసం ఈమెను సంప్రదించగా.. ఏమైనా ఏరుకోరి తీసుకోవడంతో తనకి కూడా పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో నటించిందట.

శోభన కల్కి పార్ట్-2 లో కూడా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కల్కి మూవీ తర్వాత శోభన వరుసగా సినిమాలు చేయదట.కేవలం తనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలలోని నటించేలా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నానంటూ తెలియజేస్తోంది. ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన విజయశాంతి కూడా అంతే తనకు మంచి క్యారెక్టర్ వస్తే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. లేకపోతే వాటిని సున్నితంగానే తిరస్కరిస్తుంది అలాగే ఇప్పుడు శోభన కూడా విజయశాంతినే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె గురించి ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: