దారుణంగా పడిపోయిన అక్షయ్ మార్కెట్.. ఆఖరి 5 మూవీల మొదటి రోజు కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ ఈ మధ్య వరుసగా అపజాయలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇకపోతే ఆయన ఆఖరుగా నటించిన 5 సినిమాలకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫేరా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సుధా కొంగర దర్శకత్వం వహించింది. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి సురరై పోట్రు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ మూవీ కి కూడా దర్శకత్వం వహించింది. ఈ మూవీ జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
అక్షయ్ కుమార్ కొంత కాలం క్రితం మిషన్ రాణిగంజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
అక్షయ్ కుమార్ కొన్ని రోజుల క్రితం సెల్ఫీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
అక్షయ్ కుమార్ కొన్ని రోజుల క్రితం బడే మియా చోటే మియా అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 31 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి  ఈ మూవీ లో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ షర్ఫ్ కూడా హీరోగా నటించాడు.
అక్షయ్ కుమార్ కొంత కాలం క్రితం OMG 2 లో అత్యంత కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
ఇకపోతే అక్షయ్ కుమార్ కి అద్భుతమైన క్రేజ్ ఉంది. కానీ ఆయనకున్న క్రేజ్ రేంజ్ లో మాత్రం ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలకు ఓపెనింగ్స్ లభించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: