టాలీవుడ్ కి కొత్త అందాలు.. ఆ సీనియర్లకు ఇక కష్టమేనా..?

MADDIBOINA AJAY KUMAR
ఏ రంగంలో అయినా కొత్త వాళ్ళు వచ్చారు అంటే సీనియర్లు తప్పుకోవాల్సి వస్తోంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొత్త అందాలు వచ్చాయి. దానితో సీనియర్ స్టార్ హీరోయిన్లకు కూడా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. మరి ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొత్త హీరోయిన్లు ఎవరు అనేది తెలుసుకుందాం.
ప్రస్తుతం తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోయిన్లలో శ్రీ లీల మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈమె పెళ్లి సందD సినిమాతో తెలుగు తలకు పరిచయం అయ్యి ఆ తర్వాత నుండి వరుసగా తెలుగులో అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ బ్యూటీ ఎంట్రీ తర్వాత సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు కూడా భారీగానే తగ్గాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మరో యువ నటి సంయుక్త మీనన్ "భీమ్లా నాయక్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఇప్పటికే అనేక విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు ఉంది.
డీజే టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నేహా శెట్టి ప్రస్తుతం తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇక ఈమెకు వరుసగా మంచి గుర్తింపు కలిగిన సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ విజయాన్ని అందుకున్న కృతి శెట్టి కూడా తెలుగులో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.  ఇక ఈమెకు కూడా అద్భుతమైన అవకాశాలు తెలుగులో ప్రస్తుతం లభిస్తున్నాయి.
సీత రామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మృణాల్ ఠాగూర్ కూడా వరుస విజయాలను అందుకుంటు తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
నా సామి రంగ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఆశక రంగనాథ్ కి కూడా తెలుగులో ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉంది. ఈమెకు కూడా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
ఇలా తెలుగు సినీ పరిశ్రమలోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వీరంతా కూడా ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరియర్ నీ ముందుకు సాగిస్తూ సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: