అన్నలాంటి హీరోతో రొమాన్స్..శ్రీ లీల బోల్డ్ స్టెప్ కి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!?

frame అన్నలాంటి హీరోతో రొమాన్స్..శ్రీ లీల బోల్డ్ స్టెప్ కి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుంటున్నారో అస్సలు గెస్ చేయలేకపోతున్నాం. కొంతమంది పద్ధతిగా ఉండే రోల్స్నే చూస్ చేసుకుంటాము అంటూ భీష్ముంచుకుని కూర్చుంటే . మరి కొంతమంది మాత్రం డబ్బు కోసం పాపులారిటీ కోసం ఎలాంటి రోల్స్ అయినా చేస్తాము అనే రేంజ్ లో ముందుకెళ్ళిపోతున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది బాలీవుడ్ బ్యూటీస్ అయితే అసలు ఊహించలేని పాత్రలను  కూడా ఓకే చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోతుంది శ్రీలీల అంటూ జనాలు బాధ పడిపోతున్నారు.


శ్రీలీల పై జనాలలో నెగిటివిటీ ఉంది . కానీ హ్యూజ్ నెగిటివిటీ అయితే లేదు.  శ్రీ లీల చిన్నమ్మాయి తెలిసి తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది . ఇదే విధంగా మాట్లాడుకునే వాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం శ్రీలీల పేరు చెప్తే జనాలు మండి పడిపోతున్నారు . దానికి కారణం ఆమె చూస్ చేసుకునే కథలు . ఆమె చూస్ చేసుకునే హీరోలే . అసలు తన వయసుకు దగ్గర దగ్గరగా ఉండే హీరోలతో కాదు డబల్ ట్రిపుల్ స్థాయిలో ఉండే హీరోలతో స్క్రీన్ షేర్  చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది .


అది కూడా బోల్డ్ రొమాంటిక్ పాత్రల్లో . తాజాగా ఇప్పుడు హీరో రానా దగ్గుబాటితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రానా - శ్రీలీల అసలు ఈ కాంబో ని ఎవరు ఊహించలేరు. ఎందుకంటే రానా ఆరు అడుగుల అందగాడు.  శ్రీ లీల భూమికి జానడు కూడా ఉండదు అనే ట్యాగ్ తో ట్రోల్ చేస్తూ ఉంటారు . మరి వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అవుతుంది . అసలు వీళ్ళిద్దరూ ఎలా స్క్రీన్పై హీరో హీరోయిన్లుగా కనిపించగలరు అంటు జనాలు మాట్లాడుకుంటున్నారు . అసలు ఈ కాంబో ని సెట్ చేయాలన్న ఆలోచన వచ్చిన డైరెక్టర్ కి నిజంగా దండేసి దండం పెట్టాలి అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి శ్రీలీల సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యూజ్ ట్రోల్లింగ్ ఎదుర్కొంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: