సిస్టర్ సెంటిమెంట్‌తో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీరే..!

frame సిస్టర్ సెంటిమెంట్‌తో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీరే..!

Amruth kumar
ఇక మన చిత్ర పరిశ్ర‌మ‌లో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎవరు ఎలా ఫెయిలవుతారు అనేది ఎవరూ చెప్పలేరు .. ఎంతోమంది చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టి విజయాలు సాధించారు, అలాగే కొంద ఫీల్ అవుతూ వస్తున్నారు . మన చిత్ర పరిశ్రమలో  ఒకరు ఎంట్రీ ఇస్తే వారితో పాటు వారి కుటుంబం నుంచి కూడా చాలామంది నటులుగా అడుగు పెడుతూ  ఉండటం ఇప్పుడు ఎంతో కామన్ గా మారింది .. అయితే ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లోనే మంచి సక్సెస్ అందుకున్నారు .. కానీ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల అక్కల సెంటిమెంట్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొందరు బ్యూటీ లు మాత్రం  ఫీలయ్యారు ఇంతకీ వారెవరంటే..

 
తెలుగు చత్ర పరిశ్రమ లో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు .. ఇక ఈ ముద్దుగుమ్మ చెల్లి  నిషా అగర్వాల్ కూడా చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టింది .. కానీ అంతగా సక్సెస్ అందుకోలేదు . ఒకప్పుడు తన గ్లామర్ తో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు .  ఎన్నో సినిమాలో నటించి ఎంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది .. తన చెల్లి నిధి అగర్వాల్ కూడా గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. కానీ ఆ తర్వాత అంతగా పాపులర్ కాలక పోయింది.

 
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అయితే ఈ బ్యూటీ చెల్లెలు ప్రణతి చోప్రా కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టింది.  అక్కల అంతగా ఫేమస్ కాలేక పోయింది.  మరో స్టార్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది .  బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో తన నటనతో అదరగొడుతుంది . అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సిస్టర్ అక్షర హాసన్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అదేవిధంగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్లో సాహస వీరుడు సాగర కన్య సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శిల్పా శెట్టి .. ఈ బ్యూటీ చెల్లెలు షమితా శెట్టి  కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: