కలిసి ఒక్క మూవీ కూడా చేయకుండా నరేష్.. నాని క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలలో కొంత మంది మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక కొంత మంది సినిమాలలో కలిసి నటించడం వల్ల ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత అలాగే వారి స్నేహం కొనసాగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ మరి కొంత మంది సినిమాలలో కలిసిన నటించకపోయినా బయట కొన్ని ఈవెంట్ లలో కలిసి ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కుదిరి మంచి స్నేహితులుగా మారిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి అల్లరి నరేష్ , నాని ఇద్దరు కూడా మంచి స్నేహితులు.

కాకపోతే వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. అయిన వీరిద్దరూ మంచి స్నేహంతో కొనసాగుతూ ఉంటారు. ఇకపోతే తాజాగా అల్లరి నరేష్ ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా నాని తో ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది. ప్రస్తుతం ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... 2008 వ సంవత్సరంలో 16 చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఆ 16 సినిమాలో కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈటీవీ సంస్థ వారు ఒక ఈవెంట్ ను నిర్వహించారు. దానికి నేను వచ్చాను , నాని , శర్వానంద్ మరి కొంత మంది యంగ్ హీరోలు కూడా వచ్చారు.

ఇకపోతే ఆ ఈవెంట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత నాని కి నాకు మంచి మాటలు కుదిరాయి. ఇక ఈవెంట్ అయిన తర్వాత ఎక్కడికైనా డిన్నర్ కు వెళ్దాం అని చెప్పి మేము అంతా వెళ్ళాము. అలా మేము గడిపిన ఆ కొద్ద సమయం లోనే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇక ఆ స్నేహం ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. మేము దాదాపు వారంలో ఒక్క సారైనా కలుస్తాం ... సరదాగా మాట్లాడుకుంటాం. మా స్నేహం ఇప్పటికి కూడా మంచిగా ముందుకు సాగుతుంది అని నరేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: