కల్కి సినిమాని ఫాలో అవుతున్న డార్లింగ్ మేకర్స్?

Suma Kallamadi
కల్కి 2898ఏడీ మూవీ గురించి ఇపుడు ఇక్కడ ప్రత్యేకమైన పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఏ రేంజులో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై మూడు వారాలు కావస్తున్నా ఇంకా థియేటర్స్ లో మూవీ కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు గెస్ట్ రోల్స్ లో కనిపించి విందు చేసారు. ఇక వారు చేసినవి చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయ్యాయి అనడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు. దర్శక దిగ్గజం రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వారు మూవీలో కనిపించి ఆహుతులను అలరించారు.
అదేవిధంగా దర్శకుడు తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ... కల్కి పార్ట్ 2లో కూడా నేచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి వంటివారు గెస్ట్ రోల్స్ చేసే అవకాశం ఉందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు కూడా. అయితే ఆ ప్రయత్నం సినిమాకి ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తమకి నచ్చినవారు ఏదో ఒక క్యారెక్టర్ లో కనిపిస్తే ఆడియన్స్ లో ఓ స్మైల్ క్రియేట్ అవుతుంది. దానికోసం నేను గెస్ట్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే... ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి డార్లింగ్ మూవీతో మరోసారి లీడ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూస్తేనే అందులో కావాల్సినంత ఫన్ క్రియేట్ చేసారు అని యిట్టె తెలిసిపోతుంది.
అయితే ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కల్కి తరహాలోనే కొంతమంది ఆర్టిస్ట్స్ ని గెస్ట్ రోల్స్ కోసం తీసుకున్నారనే సౌండ్ బాగా వినబడుతోంది. అయితే అలా మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టర్లు ఎవరనేది మాత్రం ట్రైలర్ లో రివీల్ చేయలేదు. కాగా ఈ సినిమాలో మల్టీపుల్ పర్సనల్ డిజాస్టర్ ఉన్న అమ్మాయిగా నభా నటేష్ కనిపించింది. పెళ్లి చేసుకొని భార్యతో హనీమూన్ కి ఇటలీ వెళ్లాలని కలలుగానే యువకుడిగా ప్రియదర్శి ఈ చిత్రంలో మెరవనున్నాడు. పెళ్లి తర్వాత అతను భార్యతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది కథలో భాగంగా ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: