ఆ ఇద్దరు తెలుగు హీరోలను ఫుల్ గా వాడేసిన కమల్..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో తాజాగా భారతీయుడు 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్ ముఖ్య పాత్రాలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాండ్ సంస్థల వారు ఈ మూవీ ని సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ తాజాగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ కి మొదటి రోజు భారీగానే ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన సినిమాలకు సంబంధించిన పాటలు వచ్చాయి.

ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా లోని ఒక సన్నివేశంలో మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీని మడత పెట్టి అంటూ సాగే సాంగ్ వచ్చింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి జరగండి జరగండి అంటూ సాగే పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పాటను కూడా ఒక సిచువేషన్ లో ఈ సినిమాలో ప్లే చేశారు. ఇలా మహేష్ బాబు , రామ్ చరణ్ లకు మూవీలకి సంబంధించిన పాటలను భారతీయుడు 2 సినిమాలో ప్లే చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: