రామ్ అభిమానులను వెంటాడుతున్న ఆ భయం.. ఈసారి అలా జరిగితే కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన క్రాక్ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2021 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే 2021 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ పోతినేని హీరో గా రూపొందిన రెడ్ సినిమా కూడా విడుదల అయింది.

ఈ సినిమా జనవరి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ క్రాక్ మూవీ అద్భుతమైన టాక్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. దానితో ఆ సంవత్సరం క్రాక్ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక 2021 సంక్రాంతి రేసులో నిలిచిన రవితేజ , రామ్ పోతినేనిలో రవితేజ దే చేయి అయింది. ఇకపోతే ఈ ఇద్దరు హీరోలు మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే పరిస్థితులు కనపడుతున్నాయి. రామ్ పోతినేని ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల అయినట్లు అయితే మళ్లీ వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడతారు. మరి ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: