స్పిరిట్ స్టోరీ ఇదా? ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా?

Purushottham Vinay

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత ఏడాది యానిమల్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఏకంగా 900 కోట్ల పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా యానిమల్ మూవీ కలెక్ట్ చేసింది.దీనిని బట్టి సినిమాకి ఎలాంటి ఆదరణ వచ్చిందో పూర్తిగా అర్ధం చేసుకోవచ్చు. మోస్ట్ వైలెంట్ మూవీగా యానిమల్ మూవీని సందీప్ రెడ్డి తెరకెక్కించారు. దర్శకుడి సందీప్ రెడ్డి స్టైల్ కూడా వైలెన్స్ అని ఆయన సినిమాలు చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. హై ప్రొఫైల్ లోనే హీరో క్యారెక్టరైజేషన్స్ ని సందీప్ రెడ్డి డిజైన్ చేస్తాడు. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవసినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగానే ఈ సినిమానమూవీని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంట. 300 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. 


పైగా ఈ సినిమాకి సందీప్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే మరో వైపు క్యాస్టింగ్ ని కూడా కన్ఫర్మ్ చేసుకునే పనిలో సందీప్ రెడ్డి వంగా ఉన్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో డ్రగ్స్ ప్లీడర్లు, డీలర్స్ తో వర్క్ చేసే కరప్టెడ్ కాప్ పాత్రలో ప్రభాస్ పాత్ర ఉంటుందట. అయితే డ్రగ్స్ మాఫియాతో కలిసి పనిచేస్తూనే వారిని పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా నాశనం చేసాడు అనేది ఈ కథలో భాగంగా చెప్పబోతున్నారట. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా ఈ మూవీని సందీప్ రెడ్డి తెరకెక్కించబోతున్నారంట. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో స్పెక్టక్యులర్ గా స్పిరిట్ సినిమాలో యాక్షన్ ఘట్టాలని సందీప్ రెడీ చేస్తున్నారంట. ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్, లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసుకోబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: