గేమ్ డేంజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్..!?

Anilkumar
పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాలలో "గేమ్ చేంజర్" కూడా ఒకటి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ధ్వి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చరణ్ తన మొదటి రామ్ నందన్ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానితో దర్శకుడు కూడా ఈ సినిమాను

 భారీ రేంజ్ లోనే  ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సినీ లవర్స్ కు కొంత క్లారిటీ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై చేసిన సాలిడ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అది ఏంటంటే....శంకర్ తెలుగు సినిమాలు చేయాలి అని గతంలో రెండు, మూడు సార్లు  చెప్పారు. కానీ ఎప్పుడూ కుదరలేదు. దానితో ఇప్పుడు అభిమానులకి పక్క మాస్ సినిమా కావాలి అని గేమ్ చేంజార్ అనే  సినిమాని సిద్ధం
 చేస్తున్నాను.  అంతే కాకుండా కార్తీక్ సుబ్బరాజు దగ్గర నుంచి ఒక లైన్ తీసుకొని పూర్తి మాస్ సినిమా గా అభిమానులు అందరు ఎంజాయ్ చేసేలా ఈ

 సినిమాని తెరకెక్కించబోతున్నాము అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ శంకర్. దానితో శంకర్ కాన్ఫిడెంట్ గా ఇది మాస్  మూవీ  అని చెప్పడం తో ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగిపోయాయి.  ఇది కాసేపు పక్కన పెడితే.... ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తో తెరమీదికి వస్తుండడం తో చరణ్ ఫ్యాన్స్ అంత ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: