బర్త్ డే బాయ్ ట్రైలర్: పార్టీలతో హద్దు మీరే వారికి స్ట్రాంగ్ మెసేజ్?

Purushottham Vinay

ఈ కాలంలో బర్త్ డే పార్టీలు అంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. బర్త్ డే బంప్స్ అంటూ కొట్టడాలు, బాదడాలు, ఇష్టమొచ్చినట్లు విసిరేయడం కూడా చూశాం.ఈ ట్రెండ్ ఇంకాస్త మితిమీరిపోతోంది అని కూడా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఒక బర్త్ డే పార్టీ కాన్సెప్ట్ తోనే ఈ మూవీని తీసుకొస్తున్నారు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరి.. ఆ మూవీ ట్రైలర్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఈ మూవీ పేరు ది బర్త్ డే బాయ్. దీనిని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ తెలపడం జరిగింది. ఈ మూవీ ట్రైలర్ లో కూడా అదే విషయాన్ని మళ్లీ చెప్పారు. అయితే ఈ ట్రైలర్ సినిమా ప్లాట్ ఏంటి అనేది సగటు ప్రేక్షకుడికి క్లియర్ ఐడియా వచ్చేలా చేశారు. అంటే ఈ కథ ప్లాట్ ఏంటి? ఏ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది? మనం ఈ సినిమా నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేయచ్చు అనేది అయితే చాలా క్లియర్ గా చెప్పేశారు. అయితే కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎలాంటి ట్విస్టులు చూపిస్తారు అనేది మాత్రం థియేటర్ లో కూర్చునే ఆడియన్ ఊహకు వదిలేశారు.ఈ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటిని ఈ ట్రైలర్ లో రివీల్ చేశారు.

ఈ సినిమా ప్లాట్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ఫారెన్ లో ఫ్రెండ్ బర్త్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే ఆ సమయంలో వాళ్ళు కాస్త హద్దు దాటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ క్రమంలో ఆ బర్త్ డే బాయ్ ని ప్రమాదవశాత్తు చంపేస్తారు. దానిని ఎలా కవర్ చేయాలి అనేదానిపై ఈ సినిమా కథ ముందుకు నడుస్తుంది. ఈ మూవీలో రాజీవ్ కనకాల ఇంకా రవికృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే మొదట అంతా కూడా దీనిని ప్రమాదం అనుకున్నారు. ఇప్పటి దాకా ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. కానీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది నిజం కాదని తేలింది. అంటే ఎవరో చంపేశారు అనే కోణంలో ఈ మూవీ కథను రివీల్ చేశారు.ఈ పాయింట్ తోనే కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పటి దాకా ఈ సినిమాపై ఆడియన్స్ కు ఒక రకమైన వ్యూ ఉంది. ఇప్పుడు దానికి అదనంగా ఇంకో సీరియస్ పాయింట్ ఏదో ఉంది అని ప్రేక్షకులను కూడా కన్విన్స్ చేశారు డైరెక్టర్. ప్రస్తుతం ఉన్న బజ్ చూస్తే ది బర్త్ డే బాయ్ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా జులై 19 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: