శ్రీలంకకు విజయ్ దేవరకొండ.. అందుకోసమేనా..?

murali krishna
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా రేంజ్‏లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ తోపాటు, నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. కల్కి చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు తిరిగి తన అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12. జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ టీం శ్రీలంకలో ల్యాండైంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో కథానాయిక ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వర్క్ చేయనున్నాడు. వీడీ 13 వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.విజయ్‌ దేవరకొండ దీంతోపాటు టాక్సీవాలా ఫేం రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో VD14 కూడా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో 59వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: