బింబిసారా తర్వాత ప్రమాదంలో పడిపోయిన కళ్యాణ్ రామ్ కెరియర్.. ఇప్పుడు హిట్ కంపల్సరీ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా చాలా సినిమాలను నిర్మించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈయన ఆఖరుగా బింబిసార అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన అమిగొస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈయన డెవిల్ అనే మరో సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడమే విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇలా బింబిసారా మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నటించిన రెండు మూవీ లతో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన "ఎన్ కే ఆర్ 21" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఓ సినిమాలోను , బింబిసారా పార్ట్ 2 మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలపై ఈయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలలో కనీసం ఒక దానితో అయినా కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకోకపోయినట్లు అయితే ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రమాదమే ఉండే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఆయన నటించే తదుపరి సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా ఉండవు. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేస్తాడేమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr

సంబంధిత వార్తలు: