ఖుష్బూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తెలిసి ఏడ్చేసిన హీరో..??

Suma Kallamadi

ప్రముఖ నటి ఖుష్బు సుందర్ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి మెప్పించింది. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ 185 చిత్రాలలో యాక్ట్ చేసింది. 2000లో ఖుష్బు యాక్టర్, డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన సుందర్ Cని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి. ఈ సినీ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు.
హిందువుని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె హిందువుగా మతాన్ని మార్చుకోలేదు. అయితే తన పెళ్లి సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని తాజాగా ఆమెను పంచుకుంది. సీతాకోకచిలుక అన్వేషణ మూవీ ఫేమ్ కార్తీక్ తన వెడ్డింగ్ జరుగుతున్నప్పుడు ఏడ్చాడని ఆమె చెబుతూ షాక్ ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”సుందర్ సి, కార్తీక్‌ మంచి ఫ్రెండ్స్‌. ఒకరోజు అతడు నన్ను పెళ్లి చేసుకోనున్నట్లు కార్తీక్‌తో చెప్పాడు. 'సుందర్‌ నీకు మంచి జోడీ' అని కార్తీక్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు, ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు నేను, సుందర్.. కార్తీక్ కాళ్లపై పడ్డాం. ఆయన నిండు మనసుతో బ్లెస్స్ చేశాడు, సమయంలోనూ కార్తీక్ హ్యాపీ టీయర్స్ రాల్చాడు." అని చెప్పుకొచ్చింది.
80వ దశకంలో బాలనటిగాగా బాలీవుడ్‌ కెరీర్‌ని ప్రారంభించిన ఖుష్బు, 1988లో తమిళ చిత్రం "ధర్మతిన్ తలైవన్"లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. "16 వయత్తినీలే," "విక్టరీ వాసల్," "మైఖేల్ మదన కామ రాజన్," "నడిగన్," "చిన్నతంబి" వంటి వరుస హిట్లతో ఆమె త్వరగా కీర్తిని పొందింది. కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు వెల్లువెత్తడంతో ఖుష్బు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 200 చిత్రాలలో నటించింది, రజనీకాంత్, కమల్ హాసన్, శరత్‌కుమార్, ప్రభు, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులతో స్క్రీన్‌ను పంచుకుంది.
ముఖ్యంగా, ఆమె 100 కంటే ఎక్కువ తమిళ చిత్రాలలో కనిపించింది. ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు తమిళ అభిమానులలో ఆమెపై ఉన్న అపారమైన ఆదరణ స్పష్టంగా కనిపించింది. సుందర్ సి తన తొలి దర్శకుడిగా చేసిన "మురైమామన్" చిత్రంలో ఖుష్బు కథానాయికగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుందర్ ఖుష్బుకి ప్రపోజ్ చేశాడు. ప్రేమలో పడి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: