"చిరు" కోసం ఆ బ్లాక్ బస్టర్ మూవీని త్యాగం చేసిన "కృష్ణ"..?

Pulgam Srinivas
సినీ పరిశ్రమలో ఉన్న కొంత మంది హీరోలు తమ దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు దానిని విన్న తర్వాత ఆ సినిమా కథ బాగున్న తమపై సెట్ కాదు అనుకుంటే వేరే వాళ్ళతో ఈ సినిమా బాగుంటుంది అని వారికి సూచనలు ఇచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన దగ్గరకు వచ్చిన ఒక కథ తనకు సెట్ కాదు అని మరో హీరో పేరును ఆ మూవీ బృందానికి సూచించాడట. తీరా చూస్తే ఆ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇంతకు కృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీ ఏది ..? అందులో సూచించిన హీరో ఎవరు ..? అనే వివరాలను తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్గా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఖైదీ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే.

1983 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా ఆ టైమ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ తో చిరంజీవి కి మాస్ ఆడియన్స్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఇంతటి స్థాయి విజయం అందుకున్న ఈ సినిమా కథను మొదట ఈ మూవీ బృందం సూపర్ స్టార్ కృష్ణ కు వినిపించారట. ఈ మూవీ కథ మొత్తం విన్న కృష్ణ కు ఈ సినిమా కథ సూపర్ గా ఉంది. అద్భుతమైన బ్లాక్ బాస్టర్ అయ్యే లక్షణాలు ఈ కథలో ఉన్నాయి.

కాకపోతే ఈ సినిమా కథను నాపై తీస్తే వర్కౌట్ కాదు. ఈ మూవీ ని చిరంజీవి తో తీయండి అతనిపై ఈ సినిమా చాలా బాగా ఉంటుంది అని కృష్ణ సలహా ఇచ్చాడట. ఇక కృష్ణ సలహా మేరకు ఈ మూవీ బృందం చిరంజీవి ని కలిసి ఈ మూవీ కథను చెప్పడం , ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , ఇక ఈ మూవీ ఖైదీ అనే పేరుతో రూపొంది విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం జరిగిందట. అలా కృష్ణ గారు తన దగ్గరకు వచ్చిన కథను చిరంజీవితో అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట. అలా కృష్ణ సలహాతో చిరంజీవి కి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: