మృనాల్.. రకుల్ ని ఫాలో కానుందా.. అందుకే తెలుగు మూవీలకు ఓకే చెప్పడం లేదా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మృణాల్ ఠాగూర్ మొదట హిందీలో సీరియల్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమెకు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈ బ్యూటీ షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్  తిన్ననురి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జెర్సీ సినిమాకి హిందీ రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇందులో మృణాల్ మాత్రం తన అద్భుతమైన అందాల ప్రదర్శనతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈ సినిమా తర్వాత ఈమె హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తో ఈమెకు తెలుగులో సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈమెకు హాయ్ నాన్న , ది ఫ్యామిలీ స్టార్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన కల్కి సినిమాలో మృణాల్ ఠాకూర్ ఓ చిన్న పాత్రలో నటించింది. 

ఇప్పటికే ఈమెకు మంచి విజయాలు తెలుగు లో ఉండడంతో క్రేజీ తెలుగు సినిమాలలో ఈ బ్యూటీ కి అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది. కాకపోతే ఈమె మళ్లీ హిందీ సినీ పరిశ్రమ వైపు వెళ్లాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ బ్యూటీ అజయ్ దేవగన్ హీరోగా రూపొంది సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు , దానితో ఈ బ్యూటీ మల్లి హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేయనన్నట్లు తెలుస్తోంది. ఇక రకుల్ కూడా ఇలానే తెలుగులో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలో హిందీ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపించి తెలుగు ఇంట్రెస్ట్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: