టాలీవుడ్ లో హీరో నాని నటించిన ‘జెంటిల్ మెన్’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ నివేదా థామస్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తరువాత వరుసగా పలు హిట్ సినిమాల్లో నటించి నివేదా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.అయితే, ఈమధ్య ఈ బ్యూటీ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ‘శాకిని డాకిని’ తరువాత నివేదా థామస్ తెలుగు సినిమాను ఓకే చేయలేదు. దీంతో ఆమె ఎందుకు సైలెంట్ అయ్యిందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఇప్పుడు ఆమె తన కొత్త ప్రాజెక్టును రిలీజ్ కు రెడీ చేసింది. రానా దగ్గుబాటి నిర్మాతగా ’35 – చిన్న కథ కాదు’ అంటూ తన కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసింది ఈ బ్యూటీ.డెబ్యూ డైరెక్టర్ నందకిశోర్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గబాటి సమర్పిస్తున్నాడు.ప్రియదర్శి, యువ నటుడు విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం.
ఈ మేరకు తాజాగా '35 చిన్న కథ కాదు' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నివేదా ఓ మధ్యతరగతి గృహిణిల కనిపించగా.. తన చుట్టూ పిల్లలు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పోస్టర్ బట్టి చూస్తుంటే.. మిడిల్ క్లాస్ వ్యక్తులు పడే కష్టాలు, సంతోషాలను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నివేదా లుక్కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.ఈ సినిమాలో నివేదా లీడ్ రోల్ లో నటిస్తుండగా ప్రియదర్శి, విశ్వదేవ్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను నంద కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన నటి సినిమా వస్తుండటంతో నివేదా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.