హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసిన హీరోలు ఎవరో తెలుసా?.. బడా హీరోలకి సైతం తప్పలేదుగా..!

lakhmi saranya
టాలీవుడ్ లో ఏ హీరో కైనా పరాజయాలు కామన్. ఎన్టీఆర్, ఎన్నార్ నుంచి, చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ ల వరకు దీన్ని ఫేస్ చేశారు. మరి ఇప్పుడు సూపర్ స్టార్స్ గా రాణిస్తున్న నేటితరం హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వరకు పరజయాలను ఎదుర్కొన్నారు. కొందరైతే డబల్, త్రిబుల్ హ్యాట్రిక్ ప్లాపులను ఫేస్ చెయ్యటం గమనర్హం. మరి ఆ హీరోలు, ఆయా సినిమాలేంటో చూద్దాం.
1. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు. ఆయన కెరియర్లో హ్యాట్రిక్ ప్లావులున్నాయి. 'జానీ' గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం బ్యాక్ టు బ్యాక్ పరజయం చెందాయి. జల్సా, తర్వాత మరోసారి పులి, తీన్మార్, పంజా సినిమాలు పోయాయి. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలు కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి.
2. మహేష్ కి కూడా హ్యాట్రిక్ ప్లాపులున్నాయి. 'పోకిరి' సినిమా తర్వాత వరసగా పరాజయం చెందాయి. 'సైనికుడు' అతిధి' కలేజా' చిత్రాలు ఆడలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
3. ప్రస్తుతం 'కల్కి 2898 ఏడి' తో రాబోతున్న ప్రభాస్ కెరియర్ లోనూ వరుస పరాజయాలున్నాయి. 'చత్రపతి' తరువాత 'పౌర్ణమి'  'యోగి' ' మున్నా'  'బుజ్జిగాడు 'బిల్లా' ' నిరంజన్ లతో డబల్ హ్యాట్రిక్ కొట్టాడు డార్లింగ్. బాహుబలి తరువాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ పోయాయి.
4. ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి తరువాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖి, చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు తారక్. బృందావనం తరువాత శక్తి , ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస ఆల్మోస్ట్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాలను అందుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం 'దేవర' తో రాబోతున్నాడు.
5. అల్లు అర్జున్ దేశముదురు తరువాత పరుగు, ఆర్య 2, వరుడు చిత్రాలతో ప్లాప్ చవిచూశాడు. ఇప్పుడు పుష్ప 2 తో ఇండియా ని షేక్ చేయడానికి రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: