కల్కి 2898 AD : 3వ రోజు కూడా బుక్ మై షో లో అదే జోష్..!

MADDIBOINA AJAY KUMAR
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2888 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదలకి దాదాపు నాలుగు రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షో యాప్ లో ఇండియాలో అందుబాటు లోకి వచ్చాయి. ఇక సినిమా విడుదలకు ముందు ఈ మూవీ టికెట్ లకి బుక్ మై షో లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఒక్క సారిగా బుక్ మై షో లో ఈ సినిమా యొక్క బుకింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీ యొక్క బుకింగ్స్ బుక్ మై షో లో 3 వ రోజు కూడా అద్భుతమైన స్థాయిలో జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు విడుదల అయిన మూడవ రోజు బుక్ మై షో లో 1.28 మిలియన్ సేల్స్ జరిగాయి. ఒక విధంగా చూసుకుంటే 3 వ రోజు కూడా ఈ స్థాయి రెస్పాన్స్ బుక్ మై షో లో ఈ సినిమా టికెట్లకు వస్తుంది అంటే అది గొప్ప విషయం అని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు లభిస్తున్నాయి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాకూర్ , శోభన , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: