క‌ల్కి 2898 ADలో Jr. ఎన్టీఆర్?

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమ డార్లింగ్ ప్రభాస్ నటించిన క‌ల్కి 2898 AD సినిమా థియేటర్ల దగ్గర తన ఉనికి చాటుకుంటోంది. సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా వైలెంట్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన ఈ సినిమా భారీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అలా ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇక కల్కి సినిమాలో బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. మొదటి షో చూసిన ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు సినిమా గురించి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ లు గురించి సర్వత్రా మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన తీరు గురించి ఎన్ని చెప్పినా తక్కువే అంటూ చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే... సినిమా మొదలయ్యే ముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా టీజర్ ను వేయడంతో అభిమానులు మరింతగా ఎంజాయ్ చేసారని వినికిడి. అయితే ఇదే విషయాన్ని కొందరు ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించినట్టు చెప్పడంతో విషయం కాస్త స్ప్రెడ్ అయింది.
అయితే వాస్తవానికి ఎన్టీఆర్ దేవర టీజర్ మాత్రమే వేశారని సమాచారం. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా కావడం గమనించవచ్చు. ఇక క‌ల్కి 2898 AD సినిమా పార్ట్ 2 సినిమా ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. సినిమా చివరిలో దానికి సంబంధించి ఒక లీడ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: