పాటలు వినను.. కొరియోగ్రఫీ కూడా చేసేదేలే.. జానీ మాస్టర్ సంచలన కామెంట్స్..!

lakhmi saranya
జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తో పాటు తమిళ్ అని హిందీ చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూ మరోవైపు తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అందులో జానీ మాస్టర్ మీద పలు ఆరోపణలు చేశారు.
ఇక అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ క్రమంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.." ఇక్కడ నేను ఓ పార్టీకి అండ్ ఓ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో ఐదు కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్న. అది సమస్యల్లో చిక్కుకుంది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని హెల్ప్ ఇన్సూరెన్స్ చేస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు.
నేను అధ్యక్షుడు అయి ఆరు నెలలు అవుతుంది. ఈ సమయం లో ఏపీ అండ్ తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. ఇక సమయంలో నేను పాటలు వినను అండ్ కొరియోగ్రఫీ కూడా చేయను. ఆ నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఆ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ అండ్ ఉపాసనతో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం. పలు పనులు చేసాం. సతీష్ విషయానికి వస్తే ఆయుష చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారం కమిటీ అండ్ కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతనికి లక్ష రూపాయలు ఫై న్ విధించారు. మా అసోసియేషన్ లో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను డబ్బులు ఇచ్చా.  ఒకరి పొట్ట కొట్టాలని ఎప్పుడూ అనుకోను " అంటూ కామెంట్స్ చేశారు జానీ మాస్టర్. ప్రజెంట్ ఈ కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: