"ఆ ఒక్కటి అడక్కు" టోటల్ కలెక్షన్స్ ఇవే.. మళ్లీ అదే స్టేజ్ కి వచ్చిన నరేష్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఒకటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా , మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి ప్రభావాన్ని చూపలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి నైజాం ఏరియాలో ఒక కోటి కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 26 లక్షలు , ఉత్తరాంధ్రలో 35 లక్షలు , ఈస్ట్ గోదావరిలో 13 లక్షలు , వెస్ట్ గోదావరిలో 8 లక్షలు , గుంటూరులో 16 లక్షలు , కృష్ణ లో 23 లక్షలు , నెల్లూరులో 8 లక్షలు. మొత్తంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలలో కలిపి 2.29 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18 లక్షలు , ఓవర్సీస్ లో 14 లక్షలు. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 2.61 కోట్ల షేర్ కలక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 4.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 4.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా దాదాపుగా 1.79 కోట్ల నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ తో పెద్ద స్థాయి అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: