ఈ పొరపాటు కల్కి సినిమాపైన ప్రభావం చూపిస్తుందా?

Suma Kallamadi
దాదాపు దశాబ్దకాలం కిందటి నుండి తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరుగుతూ వస్తున్నాయి. భారీ బడ్జెట్ లతో మూవీస్ చేయడమే కాకుండా కంటెంట్ విషయంలో మనోళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట విఎఫ్ఎక్స్ కి పెద్దపీట వేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మిగిలిన కథని ఒక ఫిక్షనల్ ప్రపంచంలో రీక్రియేట్ చేసి ఆడియన్స్ కి కనువిందు చేస్తున్నారు. దానికోసం అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్లకుండా ఇన్ డోర్ లోనే సెట్స్ వేసి వారికి కావాల్సిన లొకేషన్స్ కి క్రియేట్ చేయడంలో ఇపుడు మనోళ్లు మిగతా ఫారిన్ సినిమాలతో పోటీ పడుతున్నారనే చెప్పుకోవాలి.
అవును, సీజీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. మరోవైపు న్యూ వరల్డ్ ను చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేయాలని మనోళ్లు సినిమాకి 3డీ టచ్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. మన దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల 3డీ వెర్షన్ లో మూవీని ప్రదర్శించడం అసాధ్యం. కేవలం మల్టీప్లెక్స్ లలో మాత్రమే 3డీ సాధ్యం అవుతుంది. అయితే మేకర్స్ 3డీ వెర్షన్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వలన ఆ ఇంపాక్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పై పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో కూడా శంకర్ 2.ఓ మూవీని 3డీలో రిలీజ్ చేసి దానిని ఎక్కువగా ప్రమోట్ చేయడం వలన ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద ఎంతోకొంత కనిపించింది.
కట్ చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ హౌస్ ఫుల్ కాలేదు. ఇప్పుడు ఇదే సమస్య కల్కి 2898ఏడీ చిత్రానికి కూడా వర్తిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ 3డీ వెర్షన్ లో కల్కి యూనివర్స్ ని చూడమని మరీ ఎక్కువగా ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ ప్రచారంపై మేకర్స్ పునరాలోచన చేసి 3డీతో పాటు 2డీని కూడా ప్రమోట్ చేయాలని అంటున్నారు. ఇకపోతే జూన్ 27న కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. మరి ఈ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆధరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: